ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కంగారూ సందడి చేసింది. విరామ సమయంలో ఒక్కసారిగా గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన కంగారూ.. తర్వాత ఆటగాళ్లు వచ్చాక వారితో కలిసి కొద్దిసేపు మ్యాచ్ కూడా ఆడింది. దాదాపు అరగంటకు పైగా మైదానంలో గడిపిన కంగారూ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆదివారం కాన్‌బెర్రాలో స్థానిక మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. విరామ సమయం ముగిసి ఆటగాళ్లంతా మైదానంలోకి వచ్చే సరికి ఆరడుగులు ఉన్న ఓ కంగారూ అక్కడ కూర్చొని ఉంది. అది వెళ్లిపోతుందేమోనని కొద్దిసేపు చూశారు. కానీ వెళ్ళలేదు. అక్కడే దర్జాగా కూర్చొని ఉంది. ఫుట్‌బాల్‌ను దానివైపు విసిరినా.. అది అక్కడి నుంచి లేచి మైదానంలో పరుగులు పెట్టిందే తప్ప బయటకు వెళ్లలేదు. అరగంటకు పైగా అక్కడున్నవారందరికీ ‘కంగారూ’ పుట్టించి.. చివరకు బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత విరామం అనంతరం జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా జరిగింది.
A brief summary of why the second half was delayed today at Deakin, between @BLUE_DEVILSFC & @CanberraFC1 .
📹📹 @BarTVsports pic.twitter.com/86mypdYf3B— CapitalFootball (@CapitalFootball) June 24, 2018
This fella was in no rush to let the second half of @BLUE_DEVILSFC v @CanberraFC1 get underway. #NPLW #Canberra pic.twitter.com/oPqiiCpnh5
— CapitalFootball (@CapitalFootball) June 24, 2018