టీమ్ ఇండియా ( Team india ) మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) ఏం కల కంటున్నారో తెలుసా ? కలల ప్రపంచంలో విహరిస్తున్నా అని ట్వీట్ చేయడం వెనుక మతలబు అదేనా? సచిన్ కలకు..ఐపీఎల్ 2020 కు ఉన్న సంబంధమేంటి?
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. క్రీడా ప్రపంచంలో ముఖ్యంగా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ ఎక్కౌంట్ లో సచిన్ ఓ ఫోటో పోస్ట్ ( Sachin tweet ) చేశాడు. చెట్లకు మధ్యన కట్టిన చిన్న ఉయ్యాలలో విశ్రాంతి తీసుకుంటున్న తన ఫోటో అది. కలల ప్రపంచంలో విహరిస్తున్నా అని ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Making a trip to Dreamland this #WorldTourismDay! 😋 pic.twitter.com/i1wYWYXcni
— Sachin Tendulkar (@sachin_rt) September 27, 2020
వాస్తవానికి పర్యాటక దినోత్సవాన్ని ( Tourism day ) పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ ఈ పోటో షేర్ చేసి క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫోటో కింద ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ( Monty panesar ) చేసిన సరదా కామెంట్ తో ఈ ఫోటో కాస్తా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ 2020 టైటిల్ ( IPL 2020 ) ను ముంబై ఇండియన్స్ జట్టు ( Mumbai Indians team ) మరోసారి గెలుస్తుందని కలలు కంటున్నారా అని పనేసర్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పనేసర్ పోస్టుపై సచిన్ ఏమని స్పందిస్తాడో అని చూస్తున్నారు.
ఐపీఎల్ సీజన్ 13 ( IPL Season 13 ) లో ముంబై ఇండియన్స్ జట్టు ఫేవరేట్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే రోహిత్ శర్మ సారథ్యంలో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019 లలో ఐపీఎల్ టైటిల్ ను గెల్చుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇప్పుడు ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఓడిపోయినా...కోల్ కత్తా జట్టుపై విజయం సాధించింది.
ఇప్పుడు పనేసర్ చెప్పినట్టు ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ గెలవడమే సచిన్ టెండూల్కర్ కల అనేది నిజమేనా? సచిన్ కంటున్న కల ( What is Sachin's Dream ) ఇదేనా? సమాధానం సచిన్ టెండూల్కరే చెప్పాలి మరి. Also read: Alyssa Healy breaks Dhonis Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలుకొట్టిన అలీస్సా హేలీ