చెన్నై: మిస్టర్ డిపెండబుల్, అభిమానులు ముద్దుగా ‘ది వాల్’గా పిలుచుకునే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. బ్యాటింగ్‌లో అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లకు సైతం తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించిన ద్రావిడ్ బౌలర్‌గా మారిపోయాడు. ఆయన బంతుల్ని ఎదుర్కొన్నది మరెవరో కాదు నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. అయితే ద్రావిడ్ సరదాగా వేసిన బంతులకు సీఎం బ్యాటింగ్ చేశారు. స్టేడియంలోకి మరోసారి ద్రావిడ్.. కానీ బ్యాట్స్‌మెన్‌గా కాదు ఈసారి బౌలర్‌గా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
At the inauguration of a cricket stadium in Salem today, @CMOTamilNadu #EPS with the bat. And #RahulDravid gets ready to bowl to him. pic.twitter.com/yeVEWy9xTX
— bharathnt (@bharath1) February 9, 2020
జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడుగా సేవలందిస్తున్న ద్రావిడ్ సేలంలో క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రూపా గురునాథ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సదుపాయాల్ని ద్రావిడ్ కొనియాడాడు. చిన్న చిన్న పట్టణాల నుంచే నాణ్యమైన క్రికెటర్లు వస్తారని, క్రీడాకారుల్ని ప్రోత్సహించడం మన బాధ్యత అని చెప్పారు.
అరుదైన సీన్.. ద్రావిడ్ బౌలింగ్.. సీఎం బ్యాటింగ్