India vs West Indies 1st ODI Highlights: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అతిథ్య జట్టు విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. కులదీప్ యాదవ్ కు 'ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కరేబియన్ బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. తొలుత పేసర్లు.. తర్వాత స్పినర్లు విజృంభించడంతో విండీస్ తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కైల్ మేయర్స్ (2)ను ఔట్ చేయడం ద్వారా విండీస్ పతనాన్ని ఆరంభించాడు హార్ధిక్. అయితే మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్ (17; 23 బంతుల్లో 3×4), అథనేజ్ (22; 18 బంతుల్లో 3×4, 1×6) నిలకడగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ జోడి కుదురుకున్న సమయంలో అథనేజ్‌ను అరంగేట్ర బౌలర్ ముకేశ్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే బ్రెండన్ కింగ్‌ను శార్దూల్ బౌల్డ్ చేశాడు. మన స్పినర్లు రాకతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ షై హోప్ ఒక్కడే కాసేపు క్రీజులో నిలబడ్డాడు. జడేజా, కులదీప్ చకచకా వికెట్లు తీయడంతో విండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కులదీప్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు తీశారు.
లక్ష్యం చిన్నది కావడంతో టీమిండియా త్వరగానే పనిపూర్తి చేసింది. కానీ ఐదు వికెట్లును చేజార్చుకుంది. ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కేవలం 7 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. సిక్స్ కొట్టి మాంచి ఊపుమీదున్న సూర్యకుమార్ 19 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. మరోవైపు ఇషాన్ తన మార్క్ షాట్లుతో అలరించాడు. కాసేపటికే హార్దిక్ రనౌటయ్యాడు. అనంతరం జడేజా, ఇషాన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. హాఫ్ సెంచరీ సాధించిన ఇషాన్((52; 46 బంతుల్లో 7×4, 1×6) జట్టు స్కోరు 94 వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. తర్వాత రోహిత్ తో కలిసి జడేజా మిగతా పని పూర్తి చేశాడు.
Also read: World Cup 2023: భారత్ - పాక్ మ్యాచ్.. 10 సెకన్ల యాడ్ ప్లేకి రూ.30 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook