Cricketer Died in Suspicious Way: హిమాచల్ ప్రదేశ్ తరఫున విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న యువ క్రికెటర్ సిద్ధార్థ శర్మ ప్రపంచానికి తుది వీడ్కోలు పలికాడు. ఈ సిద్ధార్థ శర్మ వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నారు, అలాగే సిద్ధార్థ్ హిమాచల్ జట్టులో కూడా సభ్యుడు. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా, ఈ ఆటగాడు చాలా చిన్న వయసులోనే ప్రపంచాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.
సిద్ధార్థ్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గత 2 వారాలుగా అనారోగ్యం కారణంగా ఆటకు దూరంగా ఉండి ఆసుపత్రిలో చేరాడు. మధ్యమధ్యలో కోలుకున్నారని వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ ఆటగాడి ఆరోగ్యం మరోసారి క్షీణించింది. గుజరాత్‌లోని వడోదరలో సిద్ధార్థ్ తుది శ్వాస విడిచారు. రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధార్థ్ అక్కడికి వెళ్లాడు. సిద్ధార్థ్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంతాపం ప్రకటించారు.
మరోపక్క ఒడిశాలోని దట్టమైన అడవుల్లో ఓ మహిళా క్రికెటర్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడం సంచలనం రేపింది. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. ఒడిశాకు చెందిన ఈ మహిళా క్రికెటర్ గత రెండు రోజులుగా అదృశ్యం కాగా, ఇప్పుడు ఆమె మరణానికి చెందిన విషాద వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైనీ జనవరి 11 నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె మృతదేహం శుక్రవారం కటక్ సమీపంలోని దట్టమైన అడవుల్లో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. కటక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పినాక్ మిశ్రా మాట్లాడుతూ రాజశ్రీ మృతదేహం అథఘర్ ప్రాంతంలో గుర్డిజాతియా అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు. రాజశ్రీ కోచ్ మిస్సింగ్‌పై గురువారం కటక్‌లోని మంగళబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక గుర్డిజాతియా పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఆమె మృతికి గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అయితే ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మృతదేహాన్ని చూసే సరికి రాజశ్రీ శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని కుటుంబీకులు చెబుతున్నారు. ఆమె కళ్లు కూడా దెబ్బతిన్నాయని ప్రచారం జరుగుతోంది. రాజశ్రీ స్కూటర్ అడవికి సమీపంలో కనిపించింది, ఇక ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయబడింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA) బజ్రకబాటి ప్రాంతంలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో రాజశ్రీ సహా దాదాపు 25 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారని ఈ శిబిరానికి హాజరైన మహిళా క్రికెటర్లంతా ఓ హోటల్‌లో బస చేశారు. ఒడిశా రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టును జనవరి 10న ప్రకటించారు కానీ తుది జాబితాలో రాజశ్రీని చేర్చలేదు. మరుసటి రోజు ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం టాంగి ప్రాంతంలోని క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్లారని అప్పుడు రాజశ్రీ తన తండ్రిని కలవడానికి పూరీకి వెళ్తున్నట్లు కోచ్‌కి చెప్పింది.
Also Read: Waltair Veerayya OTT Release: అప్పుడే OTTలో వాల్తేరు వీరయ్య రిలీజ్... ఎందులో అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook