Ind vs Nz: ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో నిన్న జరిగింది సెమీపైనలా లేక షమీ ఫైననా అన్పించింది. 397 పరుగులు సాధించినా ఓ దశలో ఆందోళనలో పడిపోయిన ఇండియాలో ఆశలు రేపాడు. టాప్ ఆర్డర్ మొత్తాన్ని తానొక్కడే నడ్డి విరిచాడు.
ప్రపంచకప్ 2023లో ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి సెమీఫైనల్స్‌లో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో టైటిల్ కోసం తలపడనుంది. కివీస్‌పై మ్యాచ్ అంత సులభంగా జరగలేదు. అత్యంత ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన మ్యాచ్ ఇది. 397 పరుగుల భారీ స్కోర్ సాధించిన తరువాత కూడా టీమ్ ఇండియా ఓ దశలో తీవ్ర ఆందోళనలో పడిపోయింది. నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి టీమ్ ఇండియా ఆటగాళ్లలో స్పష్టంగా కన్పించింది. ఛేజింగ్‌కు మారుపేరుగా నిలిచే కివీస్ గట్టి పోటీ ఇచ్చింది.
ఇండియా వర్సెస్ కివీస్ సెమీఫైనల్ ముగిసేసరికి ఇది షమీ పైనల్ అని అందరూ అనేలా చేశాడు. ఎందుకంటే మొహమ్మద్ షమీ ప్రారంభంలోనే డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రను అవుట్ చేయడంతో ఆ జట్టు 39 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత స్పెల్ మారింది. కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును అద్భుతంగా నడిపించారు. ఎంతగా అంటే 397 పరుగుల భారీ స్కోర్ సాధించిన ఇండియా తీవ్ర ఒత్తిడికి లోనయ్యేలా చేసింది. మూడవ వికెట్ కోల్పోకుండా 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఎవరూ వికెట్ పడగొట్టలేకపోయారు. 32 ఓవర్ల తరువాత కివీస్ స్కోరు 219 పరుగులకు 2 వికెట్లు. ఇదే స్థితిలో ఇండియా స్కోరు కూడా 226 పరుగులకు ఒక వికెట్. అంటే పెద్దగా తేడా కన్పించలేదు. రోహిత్ శర్మలో తీవ్ర నిరాశ స్పష్టంగా కన్పించింది.
ఈ దశలో షమీ మళ్లీ స్పెల్‌కు వచ్చాడు. రెండవ స్పెల్ తొలి ఓవర్‌లోనే కివీస్‌కు షాక్ ఇచ్చాడు. కేన్ విలియమ్సన్‌ను అవుట్ చేసి భారీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. అదే ఓవర్లో లాథమ్‌ను డకౌట్ చేసి పంపించేశాడు. మరి కాస్సేపటికి మిచెల్ వికెట్ కూడా పడగొట్టి న్యూజిలాండ్ జట్టులోని టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్ కూల్చేశాడు. అంటే కివీస్ జట్టులో అద్భుతమైన బ్యాటర్లందర్నీ షమీ ఒక్కడే ఇంటికి పంపించేశాడు.
మొత్తానికి ఉత్కంఠ రేపిన కివీస్‌తో సెమీఫైనల్ కాస్తా షమీ పైనల్‌గా మారింది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్‌లు హీరోలుగా మారితే..బౌలింగ్ విభాగాన్ని మొహమ్మద్ షమీ ఒక్కడే నడిపించాడు.అరుదైన 4 రికార్డులు బ్రేక్ చేశాడు.
Also read: Mohammad Shami: వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన షమీ, 4 రికార్డులు బ్రేక్, ఒకే ఒక్కడు షమీనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook