Pakistan vs New Zealand News: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్ ఇది. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్ అభిమానుల్లేకుండానే నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, మిలన్-ఉన్-నబీ పండుగలతో ఉన్నందున తగినంత భద్రతను కల్పించలేమని.. మ్యాచ్‌ను వాయిదా వేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ను నగర పోలీసులు కోరారు. ఇదే విషయాన్ని హెచ్‌సీఏ బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లింది. అయితే ఇప్పటికే ప్రపంచకప్ మ్యాచ్‌లను ఒకసారి రీషెడ్యూల్ చేసినందున బీసీసీఐ ఇందుకు ఒప్పుకోలేదు. వార్మప్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను నిర్వహించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్నవారికి టిక్కెట్ భాగస్వామి అయిన 'Bookmyshow' డబ్బును తిరిగి చెల్లించనుంది. "ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించనున్నాం. టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ అవుతుంది.." అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
అక్టోబర్ 9, అక్టోబర్ 10వ తేదీల్లో హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు బ్యాక్-టు-బ్యాక్ నిర్వహణపై కూడా హెచ్‌సీఏ బీసీసీఐకి లేఖ రాసింది. అక్టోబర్ 9వ తేదీన న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 10న జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఒక్క మ్యాచ్‌కు దాదాపు 3,000 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. అదేవిధంగా ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉంటారు. అప్పుడు కూడా మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయమని బీసీసీఐ నుంచి సమాధానం వచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ కప్ 2023లో ఇప్పటికే అతిపెద్ద మ్యాచ్‌లలో ఒకటి అయిన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరును ఒక రోజు ముందుకు జరిపిని విషయం తెలిసిందే. నిజానికి ముందుగా అక్టోబర్ 15న నిర్వహించాలని భావించారు. అయితే అదేరోజు నవరాత్రి పండుగ కారణంగా అక్టోబర్ 14వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. బెంగాల్లో ప్రధాన పండుగ కాళీ పూజతో పాటుగా నవంబర్ 12న పాకిస్థాన్- ఇంగ్లాండ్ మ్యాచ్‌కు కోల్‌కతాలో జరగాల్సిన మ్యాచ్‌ను నవంబర్ 11కి మార్చారు. ఇక మొదటి మ్యాచ్‌లో అక్టోబర్ 5వ తేదన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook