ICC World Test Championship 2023 Final: ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7న ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ వరుసగా రెండో ఏడాది చేరుకుంది. 2021 జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్‌ను ప్రకటించగా.. తాజాగా రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్‌లను స్టాండ్‌బై ప్లేయర్లుగా బీసీసీఐ చేర్చింది. వీళ్లు జట్టుతోపాటే ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధం కావడానికి కొన్ని సన్నాహక మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌ల ద్వారా భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడతారని భావిస్తోంది. ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లకు ముందు ఎలిమినేట్ అయిన జట్లలో ఉన్న టీమిండియా ఆటగాళ్లతో కోచ్ రాహుల్ ద్రవిడ్, సహాయక సిబ్బందితో కలిసి మే 23వ తేదీ నాటికి ఇంగ్లాండ్‌కు పయనమవుతారు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు సెలెక్టర్ల నుంచి మళ్లీ పిలుపువచ్చిన విషయం తెలిసిందే. గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానే టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆడిన అనుభవం రహానేకు ఉండడం కలిసివస్తుందని బీసీసీఐ భావిస్తోంది. టెస్టు టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే.. ఫామ్ కోల్పోయి వరుసగా విఫలమవ్వడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడాడు. ఐపీఎల్ ద్వారా ఫామ్‌ను చాటుకుని టీమిండియాకు ఎంపికయ్యాడు.
అజింక్య రహానే ఎంపికలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీరోల్ ప్లే చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ ధోనీని కూడా సంప్రదించారు. ధోని భరోసా ఇవ్వడంతో రహానేకు టెస్టు జట్టులో స్థానం దక్కిందని అంటున్నారు. ఇంగ్లాండ్‌లో రహానే అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ధోని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్
Also Read: IPL Controversies: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే.. ఎన్నటికీ మరువని ఘటనలు
Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పే కమిషన్ అమలుపై కీలక నిర్ణయం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook