Sonakshi Sinha Wedding: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ పెళ్లి.. సోనాక్షి సిన్హా ఏమన్నారంటే?

Sonakshi Sinha reacts about Wedding Rumours With Salman Khan. తాజాగా బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనపై వస్తున్న సీక్రెట్‌ పెళ్లి (సల్మాన్‌ ఖాన్‌తో) వార్తలపై స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 05:23 PM IST
  • సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ పెళ్లి
  • సోనాక్షి సిన్హా ఏమన్నారంటే?
  • అలా ఎలా ఆలోచిస్తారు?
Sonakshi Sinha Wedding: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ పెళ్లి.. సోనాక్షి సిన్హా ఏమన్నారంటే?

Sonakshi Sinha reacts on Wedding Rumours With Salman Khan: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్‌ ఖాన్‌ పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సోనాక్షి, సల్మాన్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోనాక్షి వేలికి సల్మాన్ ఉంగరం తొడుగుతున్న ఫొటోలు ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చాయి. అయితే ఈ పోటోను కొందరు ఆకతాయిలు మార్ఫింగ్‌ చేశారని తర్వాత తెలిసింది. తాజాగా బాలీవుడ్ బొద్దుగుమ్మ తమపై వస్తున్న సీక్రెట్‌ పెళ్లి వార్తలపై స్పందించారు. 

సోషల్ మీడియాలో ఏదిపడితే అది నిజమని నమ్మేవాళ్లను మూర్ఖులుగా పేర్కొన్నారు సోనాక్షి సిన్హా. మీరు అలా ఎలా ఆలోచిస్తారు? అని ప్రశ్నించారు. 'మీరు అలా ఎలా ఆలోచిస్తారు? చెప్పండి. రియల్‌ ఫొటోకు, మార్ఫింగ్‌ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారు అయ్యారా?' అంటూ సోనాక్షి ఫైర్ అయ్యారు. వైరల్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. మూడు లాఫింగ్‌ ఎమోజీలను జత చేశారు. దాంతో తనకు పెళ్లి జరగలేదు అని క్లారిటీ ఇచ్చారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

2010లో సల్మాన్‌ ఖాన్ హీరోగా వచ్చిన 'దబాంగ్' సినిమాతో సోనాక్షి సిన్హా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. దబాంగ్‌ 2, దబాంగ్‌ 2లో కూడా సల్మాన్‌ కలిసి నటించారు. ఆర్ రాజ్ కుమార్, ఫోర్స్,రౌడీ రాథోర్, అకిర, మిషన్ మంగళ్, లుటేరా, యాక్షన్ జాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది సోనాక్షీ.. 'కబీ ఈద్‌ కబీ దివాళి' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కూడా కండల వీరుడే హీరో. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Ravindra Jadeja: 35 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా..!!

Also Read: Radhe Shyam Making Video: రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో.. ఇండియాలోనే ఇటలీని చూపించేశారుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  
 

Trending News