యువీపై గృహహింస కేసు నమోదు

Last Updated : Oct 18, 2017, 01:10 PM IST
యువీపై గృహహింస కేసు నమోదు

భారత క్రికెటర్ యువరాజ్ పై గృహ హింస కేసు నమోదైంది. యువరాజ్ అన్న భార్య, బిగ్ బాస్ 10 కంటెస్టెంట్  ఆకాంక్ష శర్మ  ఈ కేసు పెట్టారు. యువరాజ్ సింగ్, భర్త జొరావర్ సింగ్, అత్త షబ్నమ్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఆకాంక్ష తరుపు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు. 

ఆకాంక్ష కొన్నిరోజుల నుండి భర్త జొరావర్ కు దూరంగా ఉంటోంది. వారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. కొడుకు ఎవరివద్ద ఉండాలనే విషయంలో  కోర్టులో కేసు కూడా నడుస్తోంది. తాజాగా గృహ హింస కేసు నమోదైంది. యువరాజ్ సింగ్ పై కేసు ఎలా నమోదుచేశారని విలేఖర్లు అడిగిన  ప్రశ్నలకు న్యాయవాది సమాధానమిస్తూ.. " శారీరక హింసకే కాదు.. మానసిక, ఆర్ధిక హింసలకు కూడా గృహ హింస చట్టం వర్తిస్తుంది. ఆకాంక్ష మగబిడ్డ ను కనాలని అత్త, భర్త ఒత్తిడి చేశారు. దీనికి యువీ కూడా మద్దతు పలికాడు. అందుకే అతని పేరు చేర్చాల్సివచ్చింది" అని అన్నారు. 

Trending News