హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి షాక్ తగిలింది. విశాల్, మిల్కీ బ్యూటి తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘యాక్షన్’ (Vishal Acton Movie) సినిమా వల్ల.. భారీగా నష్టపోయిన సినీ నిర్మాతకు.. హీరో విశాలే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) శుక్రవారం తీర్పునిచ్చింది.
Madras High Court issues notices to hero Vishal | ఆయన తాజా చిత్రం ‘చక్ర’తో ప్రేక్షకుల మందుకు రావాలని విశాల్ (Actor Vishal) ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం కోలీవుడ్‌లో సంచలనమైంది.
భారత్‌లో కరోనాకేసులు (Coronavirus) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తాను కూడా కరోనా బారిన పడి కోలుకున్నానని హీరో విశాల్ (Vishal) వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
విశాల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ.. 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం 8 సంతకాలు మాత్రమే అసలవని తేలిందని.. మరో ఇద్దరు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారని తెలపడం వల్ల విశాల్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
తమిళ సినీ నటుడు విశాల్ కార్యాలయంపై ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు దాడులు చేశారు. హీరో విశాల్ 'మెర్శల్' సినిమాకు మద్దతు తెలిపిన క్రమంలో ఈ దాడులు జరిగినట్లుగా తమిళ సినీ పరిశ్రమ భావిస్తోంది. కమల్, రజినీ లాంటి స్టార్స్ కూడా 'మెర్శల్' సినిమాకు మద్దతు తెలిపారు. మరి వారి ఇళ్లపై
ఎందుకు దాడులు జరగలేదో అర్థం కావటం లేదని కొందరు తమిళ సినీ ప్రముఖులు చర్చించుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.