బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలోని మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. ధోనీ రిటైర్మెంట్పై 2006లో కామెంట్లు చేశాడని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.
హైదరాబాదీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా తన బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. "281 అండ్ బియాండ్" అనే ఆ పుస్తకాన్ని స్పోర్ట్స్ రైటర్ ఆర్.కౌశిక్ రచించారు
వీవీఎస్ లక్ష్మణ్.. ఇది యావత్ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికిట్ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచినాడు. లక్ష్మణ్ పూర్తిపేరు వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ . వీవీఎస్ 1974 నవంబర్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. వీవీఎస్ టీమిండియ తరఫున 126 టెస్టు, 86 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిత్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. కాగా ఈ వ్యవధిలో వీవీఎస్ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. కళాత్మక షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేసే తీరు అద్భుతం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.