China pulls back troops from LAC | చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్‌లో నిషేధం విధించడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో కంగుతిన్న చైనా ఎట్టకేలకు తలొగ్గింది.
ఎట్టకేలకు డోక్లామ్ వివాదం సుఖాంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ఉన్న తన బలగాలను వెనక్కి రప్పించేందుకు చైనా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 70 రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. ఈ అంశంపై భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..గత నెలలో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా వివాదాస్పద ప్రాంతం డోక్లామ్ నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.