జేఎన్యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీ అంశాలపై చర్చించేందుకు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి గైర్హాజయ్యారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దు ప్రాంతాలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి ఉన్న కంచెను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.