ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువులపై దాడులు చేసేలా ప్రభుత్వం తీరు ఉందని విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
Somu Veerraju: పొత్తుల విషయంలో తమకు క్లారిటీ ఉందని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. బీజేపీ,జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ఇతర నేతలు ఎవరూ మాట్లాడినా..తమకు సంబంధం లేదని..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చెప్పిందే ఫైనల్ అని తేల్చి చెప్పారు.
వ్యంగ్యాస్థాలు సంధించడంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తరువాతే ఎవరైనా. ఏబీఎన్ రాధాకృష్ణను ఓ ఆటాడుకున్నారిప్పుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ పత్రిక రాసిన వార్తలపై మండిపడిన సోము..రాధాకృష్ణ..తెలుగుదేశం పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై చంద్రబాబుపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కీలక శక్తిగా ఎదగడానికి..బలమైన ప్రతిపక్షంగా మారడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తో భేటీలో కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.
బీజేపీ జాతీయ కార్యదర్శి ( Bjp national secretary ) రామ్ మాధవ్ ( Ram madhav ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలో రావడం అంత ఈజీ కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.