మూడు రోజుల క్రితమే అనేక హంగులతో ప్రారంభోత్సవం జరుపుకున్న అటల్ టన్నెల్లో ( Atal tunnel ) అప్పుడే మూడు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రారంభమైన ఈ సొరంగ మార్గంలో అక్టోబర్ 4న మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ( World's largest tunnel, Atal tunnel ) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్ ( Rohtang in Himachal Pradesh ) వద్ద నిర్మించారు. ఈ సొరంగం ద్వారా మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్ వరకు కేవలం 7 గంటల వ్యవధిలో చేరుకునే వెసులుబాటు కలిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.