కరోనా వైరస్ . . ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడా వణికిపోతున్నాయి. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ .. క్రమ కమంగా మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నా. . చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి.
చారిత్రక కట్టడాలు, ప్రపంచంలో గొప్పగా నిర్మాణం చేసే ఘనత చైనా సొంతం. ఇప్పుడు కరోనా వైరస్ తో గజగజలాడుతున్న చైనా . . దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాజాగా అలాంటి ఘనతనే చాటి చెప్పింది. ఆసియాలో ఆర్ధికంగా బలంగా ఉన్న చైనా .. తలచుకుంటే చేయలేనిది అంటే ఏదీ లేదని నిరూపించింది.
కరోనా వైరస్‌తో గజగజలాడుతున్న చైనా నెత్తిన మరో పిడుగు పడింది. చైనాలో మరో వైరస్‌ను గుర్తించారు. చైనాలోని హునన్ ప్రావిన్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.
కరోనా వైరస్. . చైనాను గడగడలాడిస్తోంది. వైరస్ దెబ్బకు చైనాలో మరణమృదంగం మోగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ దెబ్బకు 300 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 2 వేల మంది ఆస్పత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు వుహాన్ లో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది.
చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ . . క్రమంగా వివిధ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉంటుందోనని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ .. చాప కింద నీరులా విస్తరిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
కరోనా వైరస్. . . ఈ పేరు వింటేనే .. గుండెల్లో నుంచి వణుకు పుడుతోంది. 10 రోజుల క్రితం చైనాలో కనిపించిన ఈ వైరస్ .. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఎంతలా పరిస్థితి దిగజారిందంటే . . కరోనా వైరస్ పేరు వింటనే వెన్నులో నుంచి వణుకు వస్తోంది.
చైనాలో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్.. మిగతా దేశాలను కూడా గజగజలాడిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిందనేది ఇప్పటికీ నిర్ధారణ కావడం లేదు. చైనాలో మాత్రం ఇప్పటికి 106 మంది ప్రాణాలు మింగేసింది.
కరోనా వైరస్.. అంటే నాకేంటి భయ్యం అంటోంది.. ఓ చైనీస్ అమ్మాయి. కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న వూహాన్ లోనే ఓ అమ్మాయి.. ఐతే ఏంటట..? అంటోంది. అవును.. అంతటితో ఆగకుండా .. ఓ రెస్టారెంట్ లో గబ్బిలంతో చేసిన వంటకాన్ని తింటూ ఓ వీడియో రూపొందించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రవేశిచిందా.. ? ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో ఇదే గందరగోళం నెలకొంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు ఢిల్లీ వ్యక్తులకు వైరస్ సోకినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేశ రాజధానిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
ఆసియాలో అగ్రరాజ్యం.. ఆర్ధికంగా బలమైన రాజ్యం .. చైనాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. వారం రోజులుగా కమ్యూనిస్టు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రోజు రోజుకు చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది.
చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే స్వైన్‌ఫ్లూతో గడగడలాడుతున్న హైదరాబాద్‌ను గజగజా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.