Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కౌంటరిచ్చారు మంత్రి హరీష్ రావు.ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2074 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను ఆదాయ పన్ను, కార్పోరేట్ పన్నల నుంచి మొత్తం రూ. 48 వేల 83 కోట్లు ఆదాయన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది. ఇందులోని ఏపీకి 4.3 శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2074 కోట్లు విడుదల చేసింది. కాగా ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి 12 వేల 481 కోట్లు అందాయి.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపై కేంద్రం కనికరం చూపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన 979.36 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజక కింద 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. మంజూరు చేసిన నిధులు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఖాతా ద్వారా పోలవరానికి ప్రాజెక్టు అధారిటీకి చేరుతాయి. అలాగే 2019 నాటికి రూ. 24 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 3.5 వేల కోట్లు..వచ్చే రెండేళ్లలో ఏడాదికి 9 వేల కోట్లు చొప్పున కేటాయించాలని ప్రణాళికను సిద్ధం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.