COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,535 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) నిర్వహించగా వారిలో 22,517 కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
అమరావతి: ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 1,221 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 8,59,932కి చేరింది.
AP Coronavirus Updates |ఆంధ్రప్రదేశ్ లో నిన్న కరోనావైరస్ కేసులు భారీగా తగ్గగా.. నేడు గణనీయంగా కేసుల సంఖ్యపెరిగాయి. గడచిన 24 గంటల్లో దాదాపు 3000 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 72,082 కరోనా శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,622 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,63,573 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,855 యాక్టివ్ కేసులు ఉండగా మరో 7,14,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 35 మంది కరోనాతో మృతి చెందారు.
అమరావతి: ఏపీలో శనివారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 73,625 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించగా అందులో 5,653 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకినట్టు గుర్తించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది.
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 60,804 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 10,392 మందికి కరోనా పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనాతో మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ( Covid-19 in AP ) ఇప్పటికే లక్ష కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC ) లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు కలకలకం రేపుతోంది.
Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఏపీలో శుక్రవారం 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ 16 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 381కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Coronavirus in AP) వ్యాపించకుండా ఎప్పటికప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా శనివారం రాత్రి కరోనా కేసులపై ఓ బులెటిన్ విడుదల చేసింది.
కరోనా వైరస్ (Coronavirus) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ నివారణ కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు వేగంగా అమలు చేయడం కోసం ఏపీ సర్కార్ (AP govt) ప్రత్యేకంగా జిల్లాకు ఒక సీనియర్ అధికారిని నియమించింది.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం దాటే సమయానికే రాష్ట్రంలో నేడు ఒక్క రోజే 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
విశాఖపట్నంలో మరో కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసు (Coronavirus in Vizag) వెలుగుచూసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus positive cases in AP) 12కు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.