Flash : ఒక్కరోజే రాష్ట్రంలో 6 కొత్త కరోనావైరస్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (Coronavirus in AP) వ్యాపించకుండా ఎప్పటికప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా శనివారం రాత్రి కరోనా కేసులపై ఓ బులెటిన్ విడుదల చేసింది.

Last Updated : Mar 29, 2020, 02:00 AM IST
Flash : ఒక్కరోజే రాష్ట్రంలో 6 కొత్త కరోనావైరస్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  కరోనా వైరస్  (Coronavirus in AP) వ్యాపించకుండా ఎప్పటికప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా శనివారం రాత్రి కరోనా కేసులపై ఓ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే కొత్తగా 6 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ విడుదల చేసిన ఈ తాజా బులెటిన్‌లో పేర్కొన్న గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 19కి చేరిందని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటిల్ కేసుల విషయానికొస్తే.. జిల్లాల వారీగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4 కేసుల చొప్పున నమోదు కాగా... ప్రకాశం జిల్లాలో 3 కేసులు, కర్నూలు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

Read also : కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు డీజీపీ విజ్ఞప్తి

ఇదిలావుంటే, కరోనావైరస్ బాధితులు ఉన్న క్వారంటైన్‌ల పర్యవేక్షణకు ఏపీ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో క్వారంటైన్‌ల కు పీయూష్ కుమార్, సరిహద్దుల వద్ద ఇతర రాష్ట్రాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లకు సతీష్ చంద్రను ఏపీ సర్కార్ నియమించింది. క్వారంటైన్‌లలో బాధితులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆహారం, మంచినీరు సరఫరాపై ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. క్వారంటైన్‌లో అబ్జర్వేషన్‌లో ఉన్న బాధితులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలు, అవసరమైన చికిత్సపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని సీఎం కార్యాలయానికి నివేదికలు ఇవ్వనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News