ఏపీలో 133 రెడ్ జోన్లు.. కరోనాపై లేటెస్ట్ అప్‌డేట్స్

ఏపీలో శుక్రవారం 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ 16 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 381కి చేరుకుంది.

Last Updated : Apr 11, 2020, 05:57 AM IST
ఏపీలో 133 రెడ్ జోన్లు.. కరోనాపై లేటెస్ట్ అప్‌డేట్స్

అమరావతి: ఏపీలో శుక్రవారం 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ 16 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 381కి చేరుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన కోవిడ్ పరీక్షల్లో గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం వరకు ఏపీలో 365 యాక్టివ్ కేసులు ఉండగా.. మరో ఆరుగురు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. 

Also read : 24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన 133 ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించిన ఏపీ సర్కార్... ఆయా ప్రాంతాల్లో వైరస్‌ను నివారించడంతో పాటు వైరస్ అక్కడి నుండి మరొకరికి సోకకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News