COVID-19 treatment: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజు ఫిక్స్

Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

Last Updated : Jul 9, 2020, 06:13 PM IST
COVID-19 treatment: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజు ఫిక్స్

Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. అదే సమయంలో కరోనానాను నయం చేసేందుకు అందించే చికిత్సలో భాగంగా పలు రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. ( Also read: AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్ర బస్సులు )

కోవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా లేని రోగుల ( COVID-19 patients ) చికిత్సకు రోజుకి రూ. 3,250 ఫీజు వసూలు చేయొచ్చని ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న రోగులకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా చికిత్స అందిస్తే.. వారికి రోజుకి రూ. 5,480 ఫీజు వసూలు చేయనున్నారు. ఇక ఐసీయూలో ఉంచి ఎన్‌ఐవీతో చికిత్స అందిస్తే.. వారికి రోజుకి రూ. 5,980 ఫీజుగా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్‌‌తో ఆస్పత్రి పాలైన వారికి వెంటిలేటర్‌ లేకుండా చికిత్స అందించినట్టయితే.. వారికి రోజుకి రూ. 6,280గా ఉండనుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్టయితే.. వారికి రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు.  ( Also read: Coronavirus: గాలితో కూడా కరోనా: WHO )

ప్రైవేటు ఆస్పత్రులు ఈ ఫీజు పట్టికను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయరాదని ఏపీ సర్కార్ స్పష్టంచేసింది. ఒకవేళ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి రాని ఆస్పత్రిలో చేరిన పేషెంట్ ప్రైవేటు రూమ్ కావాలనుకుంటే.. అందుకు రోజుకు రూ.600 అదనంగా ఛార్జ్ చేయొచ్చని ఈ ఉత్వర్వులు స్పష్టంచేస్తున్నాయి. ( Also read: Telangana: 30వేలకు చేరువలో కరోనా కేసులు )

Trending News