COVID-19 in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 98 మంది మృతి

COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,535 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) నిర్వహించగా వారిలో 22,517 కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2021, 04:23 AM IST
COVID-19 in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 98 మంది మృతి

COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,535 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 22,517 కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో కరోనాతో 98 మంది మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 3,383 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 2,975 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,884 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 18,739 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 14 లక్షల11 వేల 320 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,07,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్షణాల తీవ్రతనుబట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. సాధారణ లక్షణాలతో (Corona second wave mild symptoms) పాజిటివ్ అయిన వారికి ఇంట్లోనే ఉండి చికిత్స పొందాల్సిందిగా సూచిస్తున్నారు. 

Also read : Pregnant dies in ambulance: అంబులెన్స్‌లోనే గర్భిణి మృతి.. అసలు ఆ రోజు ఏం జరిగింది ? పావనికి చికిత్స అందించేందుకు ఆస్పత్రులు ఎందుకు నిరాకరించాయి ?

కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ విధించిన పాక్షిక లాక్‌డౌన్ (Lockdown in AP) సైతం ప్రస్తుతం అమలులో ఉంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, వాణిజ్య సముదాయాలతో పాటు అన్ని ఇతర కార్యక్రమాలకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది.

Also read : Telangana: 24 గంటల్లో కరోనాతో 32 మంది మృతి.. GHMC పరిధిలోనే అధిక సంఖ్యలో కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News