నిర్మాత మారనున్న నేచురల్ స్టార్

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై "అ" అనే చిత్రాన్ని నాని నిర్మించనున్నారు.

Last Updated : Nov 25, 2017, 07:01 PM IST
నిర్మాత మారనున్న నేచురల్ స్టార్

ఈగ, భలే భలే మగాడివోయ్, ఎవడే సుబ్రహ్మణ్యం, నేను లోకల్ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యువ నటుడు నాని. ఇప్పుడు ఈ యువ కథానాయకుడు నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకోనున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై "అ" అనే చిత్రాన్ని ఆయన నిర్మించనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిత్యా మేనన్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, కాజల్ అగర్వాల్, ఇషా రెబ్బా, ప్రియదర్శి మొదలైన వారు తారాగణంగా నటించనున్నారు.

 

ఈ రోజే ఆ చిత్ర పోస్టర్ ఫస్ట్ లుక్‌ను ఫేస్బుక్‌లో విడుదల చేశారు నాని. కాఫీ కప్పు, తెల్ల కాగితాలు, భగవద్గీత, గులాబీ రేకులతో ఉన్న పోస్టర్ ఇప్పటికే చాలా వైవిధ్యంగా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టు చేయడం ప్రారంభించారు. అయితే ఈ సినిమా నానికి ఒక నిర్మాతగా ఎలాంటి లక్ తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

 

Trending News