IT JOBS సమాచార విప్లవంతో దేశ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. ఐటీ సెక్టార్లో కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు నిరుద్యోగులకు శుభవార్త తెలిపాయి. దేశంలో నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలు అయిన కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ భారీ ప్రకటన వెలువరించాయి. దేశవ్యాప్తంగా రానున్న ఏడాది కాలంలో సుమారు 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.
Capgemini Vacancies: ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్ జెమిని నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. SAP IBP కన్సల్టెంట్ పొజిషన్ భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
IT Jobs Offers: ఐటీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీనితో ఐటీ శాఖ అప్రమత్తమై ఉద్యోగాల నియామకాలపై క్లారిటీ ఇచ్చింది.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.