ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐటి దిగ్గజం

ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐటి దిగ్గజం

Last Updated : Nov 19, 2019, 10:55 AM IST
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఐటి దిగ్గజం

బెంగళూరు : ఐటీ ఉద్యోగులకు ప్రముఖ ఐటి దిగ్గజం, ఆరిన్ క్యాపిటల్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి. మోహన్ దాస్ పాయ్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగంలోని కంపెనీలు 30 వేల నుంచి 40 వేల వరకు మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. ప్రతీ ఐదేళ్లకోసారి ఐటీ రంగం ఇలా ఒడిదుడుకులకు లోనవుతుండటం సాధారణమేనని చెప్పిన ఆయన.. వ్యాపారంలో అభివృద్ధి మందగించడమే అందుకు ఓ కారణమని చెప్పుకొచ్చారు. 

ఏ రంగంలోనైనా ఓ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో భారీ సంఖ్యలో ఉద్యోగుల అవసరమవుతుందని.. అలా కొంత కాలం పోయాకా భారీ సంఖ్యలో ఉన్న మధ్య స్థాయి ఉద్యోగులు వారు పొందుతున్న వేతనాలకు తగిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చునని.. అయితే కంపెనీలు మందగమనం పాలైనపుడు వారినే తొలగించాల్సి రావడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియను మోహన్‌దాయ్ పాయ్ అభివర్ణించారు. ముఖ్యంగా కంపెనీలు వృద్ధి చెందేక్రమంలో ప్రమోషన్స్ అందుకుని ఎక్కువ వేతనాలు పొందుతున్న వారి ఉద్యోగాలే కంపెనీలు మందగమనం పాలైనప్పుడు ఇబ్బందుల్లో పడతాయని మోహన్ దాయ్ పాయ్ తెలిపారు.

Trending News