ఇప్పటి వరకు హోల్డ్‌లో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు ఒక్కసారిగా తెరపైకి రావడం ఇప్పడు చర్చనీయంశంగా మారింది. పాదయాత్ర నేపథ్యంలో కనీసం వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ చేసిన అభ్యర్థను కూడా తోచిపుచ్చడం ఆయన విషయంలో ఏ స్థాయిలో ఉచ్చు బిగిస్తోన్నారో అర్థమౌతోంది. వాస్తవానికి జగన్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోడీ సర్కార్ కు బేషరతుగా మద్దుతిచ్చారు. ఇప్పటి వరకు మోడీ సర్కార్ పై విమర్శలు చేయకుండా వస్తున్నారు. ఇంత చేస్తున్నా.. ఎందుకీ ఈ కేసు తెరపైకి వచ్చిందనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హోదాపై మాట్లాడినందుకేనా జగన్‌కు ఈ కష్టాలు ?
వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది. నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.