Padma awards 2022: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డు గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (జనవరి 25) రాత్రి ప్రకటించింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్, కొవిగ్జిన్ సృష్టించిన భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులకు పద్మ భూషణ్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.
ఒలింపిక్ పతక విజేత ..మన తెలుగు తేజం పీవీ సింధుకు మరో పురస్కారం దక్కనుంది. ఆమె పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషన్ అవార్డుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు..ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ తన సత్తా చాటి రజత పతకాన్ని దక్కించుకుంది. తాజాగా సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే ఆమె సాధిస్తున్న విజయాలను గుర్తించి కేంద్రం..ఆమె పేరును పద్మభూషణ్ కు ప్రతిపాదించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.