బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి చంపిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అతనికి జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ గతంలో చెప్పిన పలుమాటలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ రోజు కూడా జైల్లోనే గడపనున్నాడు. ఆయన తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటీషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
సీఆర్పీసీ నిబంధనల ప్రకారం, ఏ నిందితుడికైనా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధిస్తే.. అతనికి సెషన్స్ కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వగలదు. అయితే అలా బెయిల్‌కి దరఖాస్తు చేసే సమయంలో ఆర్డరు కాపీ ఇవ్వాలి.
దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారి.. ఈ హీరోయిన్లు అందరూ సల్మాన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి వస్తున్న సందర్భంలోనే వీరు జిప్సీలో ప్రయాణిస్తూ నల్లజింకలు ఉండే అటవీ ప్రాంతానికి వెళ్లారు.
జింకలను వేటాడిన కేసులో జోథ్‌పూర్ కోర్టు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్థారించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 9, 51 సెక్షన్లను అనుసరించి ఆయనపై కేసులు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.