సల్మాన్ బెయిల్ వస్తే.. స్మోకింగ్ మానేస్తానని నాతో అన్నాడు: ఆశారాం బాపు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనకు బెయిల్ వస్తే కాఫీ తాగడంతో పాటు పొగ తాగడం మానేస్తానని చెప్పాడట. 

Last Updated : Apr 7, 2018, 06:55 PM IST
సల్మాన్ బెయిల్ వస్తే.. స్మోకింగ్ మానేస్తానని నాతో అన్నాడు: ఆశారాం బాపు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనకు బెయిల్ వస్తే కాఫీ తాగడంతో పాటు పొగ తాగడం మానేస్తానని చెప్పాడట. ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు.. జోధ్ పూర్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు. "ఈ జైలు నుండి బయటకు వెళ్లేవారందరూ మంచి గుణాలు పెంపొందించుకుంటారని నా నమ్మకం. సల్మాన్ కాఫీ తాగడంతో పాటు స్మోకింగ్ కూడా మానేస్తానని నాతో అన్నాడు" అని ఆశారాం బాపు తెలిపారు.

సల్మాన్‌కి ఈ రోజు బెయిల్ లభించగానే.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఆయనకు 1998లో నల్లజింకలను వేటాడిన కేసులో 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించిన విషయం తెలిసిందే. సల్మాన్, ఆశారాం బాపూ ఒకే జైలులో గడిపారు. ఈ సందర్భంగా ఆయన సల్మాన్ గురించి ఈ మాటలు అన్నట్లు తెలుస్తోంది.

ఆశారాం బాపూ ప్రస్తుతం మైనర్ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో భాగంగా జోధ్‌పూర్ జైలులో గడుపుతున్నారు. ఒకవేళ ఆయన చేసిన నేరం నిరూపితమైతే దాదాపు 10 సంవత్సరాలు కారాగర శిక్ష పడే అవకాశం ఉంది. జోధ్‌పూర్ పోలీసులు ఆగస్టు 3, 2013లో తొలిసారిగా ఆశారాం బాపుని అరెస్టు చేశారు. పలుమార్లు బెయిల్ పిటీషన్లు వేసినప్పటికీ...ఆయన అభ్యర్థనలు అన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది

Trending News