సల్మాన్ జింకలను చంపలేదట.. వాటికి బిస్కెట్లు తినిపించాడట..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి చంపిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అతనికి జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ గతంలో చెప్పిన పలుమాటలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Last Updated : Apr 6, 2018, 12:37 PM IST
సల్మాన్ జింకలను చంపలేదట.. వాటికి బిస్కెట్లు తినిపించాడట..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి చంపిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు అతనికి జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ గతంలో చెప్పిన పలుమాటలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ తాను జింకలను చంపలేదని చెప్పారు.

"నేను మిగతా నటీనటులతో కలిసి షూటింగ్ పూర్తిచేసుకొని వెళ్తుండగా.. మాకు ఓ జింకల గుంపు కనిపించింది. మేము వాటికి దగ్గరగా వెళ్లాం. అందులో చాలావరకు పారిపోగా.. ఓ జింక మాత్రం పొదల్లో చిక్కుకుపోయింది. నేను ఆ జింకను బయటకు తీసి కొంచెం నీరు తాగించాను. ఆ తర్వాత అది ఏమైనా తింటుందేమో అని భావించి.. బిస్కెట్లు పెట్టగా అది హాయిగా వాటిని ఆరగించింది. ఆ తర్వాత ఆ జింకను అడవిలో వదిలిపెట్టాము. బహుశా ఈ సంఘటనే ఆ తర్వాత ఇంత పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారుతుందని నేను అనుకోలేదు" అని సల్మాన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఏదేమైనా.. నల్లజింకలను హతమార్చాడని స్థానిక బిష్నోయ్ తెగకు చెందిన వ్యక్తులు సల్మాన్ పై కేసు నమోదు చేయగా.. అది కొలిక్కి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. సెక్షన్ 51తో పాటు సెక్షన్ 149 క్రింద నమోదైన కేసుల్లో సల్మాన్‌ని దోషిగా పరిగణిస్తూ.. సెషన్స్ కోర్టు సల్మాన్‌కు 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా కూడా విధించింది. 

 

Trending News