నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు. ఈ రెండూ కూడా భారత మాజీ కెప్టెన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ విషయంలో నిజంగా రుజువు అయ్యాయి. ధోనీకి క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు సినిమా పరిశ్రమలో, ఇతర రంగాల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు.
బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి.
అవయవాలను దానం చేయాలని ప్రముఖ బాలీవుడ్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు జెనీలియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
బాలీవుడ్లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు.
షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తన తర్వాతి సినిమాలో కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. సాహో సినిమా సమయంలోనే కత్రినాను తీసుకోవాలని భావించినప్పటికీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అయితే, తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రభాస్ 21వ సినిమాలో కత్రినానే హీరోయిన్గా తీసుకోవాలని ఫిలింమేకర్స్ భావిస్తున్నట్టుగా మరోసారి టాక్ తెరపైకొచ్చింది. దీనిపై బాలీవుడ్ మీడియా ఏమంటుందో ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 200 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశాలున్నాయని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత పదేళ్లకుపైగా నుంచి హిందీ టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టంట్స్ మధ్య రాజకీయాలు, గొడవలు, చిలిపి తగాదాలు, అల్లరి, ఏడుపులు, అరుపులు, పెడబొబ్బలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే ఒకటేమిటి! ఎన్నో వింతలు, విశేషాల సమాహారమే ఈ రియాలిటీ గేమింగ్ షో. ఇప్పటివరకు బిగ్ బాస్ 11 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే 12వ సీజన్ తెరపైకి రానుంది. సల్మాన్ ఖాన్ నటించిన 12వ సీజన్ ప్రోమో సైతం ఇటీవలే రిలీజై, టీవీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.