కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో కొత్తగా ట్రైబల్స్ కు స్థానం కల్పించి, 15 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ప్రమాణస్వీకారం చేశారు. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
Amit Shah to visit Srisailam temple: అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పర్యటనకు రానున్నారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా ముందుగా ఢిల్లీ నుంచి గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం (Srisailam Dam Water Capacity) ఉంది. దాంతో శ్రీశైలం (Srisailam) జలాశయానికి ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఔట్ ఫ్లో 2,06,819 క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలంలో తెలంగాణ వైపున ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ( Srisailam fire tragedy ) తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు దిగ్భ్రాంతి (Hariah Rao On Srisailam Fire Accident) వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ( Srisailam Fire Accident ) దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి (Kishan Reddy On Srisailam Fire Accident) స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన నాలుగో యూనిట్ టెర్మినల్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పవర్‌ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.