Kishan Reddy: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే!

జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి  సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి (Kishan Reddy On Srisailam Fire Accident) స్పందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Aug 21, 2020, 11:19 AM IST
  • శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం
  • అగ్ని ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి
Kishan Reddy: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే!

శ్రీశైలం (Srisailam) జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి  సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి (G Kishan Reddy) స్పందించారు. ‘నిన్న అర్థరాత్రి శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బందితో మాట్లాడి వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని’ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. Fire Accident: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రం (Srisailam power project ) లో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించడంతో ఆరు యూనిట్లల్లో దట్టమైన పొగ అలుముకుంది. భారీ పేలుడు శబ్దాలతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. దాదాపు 10 మంది వరకు సిబ్బంది లోపల చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. PM Modi లేఖపై స్పందించిన సురేష్ రైనా

 

Trending News