Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర గవర్నర్  తమిళి షై సౌందరరాజన్ కు లేఖరాశారు. 

Last Updated : Aug 22, 2020, 07:00 PM IST
    • కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి షై సౌందరరాజన్ కు లేఖరాశారు.
    • 'శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగి ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం అన్నారు రేవంత్..
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తెలంగాణ రాష్ట్ర గవర్నర్  తమిళి షై సౌందరరాజన్ కు లేఖరాశారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగి ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యం అన్నారు రేవంత్. ఈ ప్రమాదానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలి అని దీనిపై క్షేత్ర సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అని విమర్శిచారు.

అధికారులపై తగిన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎంను ఆదేశించాల్సిందిగా గవర్నర్ ను కోరారు రేవంత్ రెడ్డి.

శ్రీశైలం పవర్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంపై  సీబీఐ విచారణను కోరారు రేవంత్ రెడ్డి. ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు అని తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అన్నారు రేవంత్.&

   ఇవి కూడా చదవండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం ప్రజలకు కలగడం లేదు అన్న రేవంత్ రెడ్డి ..కోవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోమని కోరారు. 

Trending News