TDP Alliance with BJP: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం దాదాపు పూర్తయింది. మరోవైపు ఈ కూటమిలో బీజేపీ కూడా చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు.
Vijayawada TDP Parliament Seat: తమ్ముడితో రచ్చ అన్న సీటుకు ఎసరు తెచ్చింది. కుటుంబ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. చివరకు రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ గల్లంతైంది. దాంతో ఆయన టీడీపీలో ఉంటారా ? పార్టీని వీడతారా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
AP Assembly Elections 2024: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా..? రెండు చోట్ల నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? సీట్ల కేటాయింపుల్లో ప్రశాంత్ కిషోర్ మార్క్ చూపిస్తున్నారా..? చంద్రబాబు కీలక నిర్ణయాల వెనుక ఉన్నదెవరు..? అసలు బాబు వ్యూహం ఏంటి..?
AP Assembly Elections: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పంతోపాటు పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..?
Chandrababu Naidu Released India Vision 2047 Document: దేశం కోసం విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు. పీవీ నరసింహరావు ఆర్థిక దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. విశాఖలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు.
ప్రముఖ గాయకుడు దివంగత బాల సుబ్రహ్మణ్యం జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఓ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.