TS SSC Board | కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హై కోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. పదో తరగతి పరీక్షలు ( SSC Exams ) రాయకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
TS 10th class exams 2020: హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
TS SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఓ స్పష్టత వచ్చింది. తెలంగాణలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 8 నుంచి యధావిధిగా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే, జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ఆ ప్రాంతాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించలేదు.
TS Tenth class exams: హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జూన్ 8 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ( TS SSC exams) జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ పరీక్షలను నిర్వహించడం అవసరమా అనే కోణంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది.
SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
కరోనావైరస్ కట్టడికి లాక్డౌన్ విధించగా.. ఆ లాక్డౌన్ని ఎప్పుడు ఎత్తివేస్తారో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి లేనందున తెలంగాణలో నిర్వహించబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2020 ( Telangana SSC exams 2020 ) విషయంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.