రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరికతో ఆయనకు పెరిగిన ఇమేజ్ ను పార్టీ నేతలు భరించలేకపోతున్నారా ? రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలు లోలోపల టెన్షన్ పడుతున్నారా ? అసలు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ను ఎందుకు వాయిదా వేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ కథనాన్ని చదవండి.
రేంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని తొలుత ఖండించిన టి.పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన స్వరం మార్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో చేరుకున్న ఉత్తమ్ కుమార్ కు రేవంత్ కాంగ్రెస్ లో చేరికపై విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన 'నో కామెంట్' బదులిచ్చారు. రేవంత్ రెడ్డి, తాను కలసి రాహుల్ తో భేటీ అయ్యామనే వార్తల్లో నిజం లేదని అన్నారు. పార్టీ పనుల్లో భాగంగా తాను ఢిల్లీ వెళ్లానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శంషాబాద్ చేరుకున్న ఒక గంట వ్యవధిలోనే రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం కొనమెరుపు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.