NTR 28th Death Anniversary: ఎన్టీఆర్ 28వ సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
BRS National Politics: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో బీఆర్ఎస్ మారిన టీఆర్ఎస్ కథ ముగిసిందా..? తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ దండుకు పక్క రాష్ట్రాల్లోనూ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయా..? తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల బీఆర్ఎస్ పనైపోయిందా ? గులాబీ దండు పరిస్థితి ఏంటి..? మళ్లీ ఫామ్‌లోకి భారత రాష్ట్ర సమితి ఎప్పుడొస్తుంది..?
Harish Rao on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నామన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమన్నారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారని చెప్పారు.
Congress MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. రెండు సీట్లకు చాలా మంది పేర్లు పరిశీలనకు రాగా.. వీరిద్దరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఒకే చేసింది.
New Industrial Corridor in Miryalaguda: మిర్యాలగూడలో కొత్త పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
E Challan Discount Latest Updates: పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పొడగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంకా పెద్ద వాహనాదారులు చెల్లించాల్సిన నేపథ్యంలో ఈ నెల 31వ తేద వరకు గడువు పొడగించింది. ఈలోపు వాహనాదారులు తమ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచించింది.
KTR Warning to CM Revanth Reddy: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు.
Bhatti Vikramarka Fires On BRS Leaders: ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్మూలా ఈ రేస్ క్యాన్సిల్ చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాలేదన్నారు. గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు.
BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
Cyber Crime in Telangana: ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు.. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఓటీపీ పేరుతో మోసాలకు తెరలేపారు. మీకు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి.
Telangana MLC Elections: తీన్మార్ మల్లన్నకు బంపర్ ఛాన్స్ దక్కబోతోందా..? ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా.. హైకమాండ్ ఆయన సేవలను గుర్తించి మరో రకంగా అవకాశం కల్పిస్తోందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Telangana MLA Quota MLC Elections Notification: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో ఈసీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రెండుస్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. వేర్వేరుగా పోలింగ్ నిర్వహిస్తే.. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉండదు.
Telangana Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్ రావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారమే చేపట్టడమే లక్ష్యంగా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు గ్రౌండ్ లెవల్లో సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్‌పై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగూ అధికారం కోల్పోయాం కానీ కేంద్రంలో మాత్రం పట్టు కోల్పోకూడదలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై గులాబీ బాస్ దృష్టి సారించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Hyderabad Metro Rail New Plan: హైదరాబాద్ నగరంలో మెట్రో రైలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రాంతాలను కలిపేవిధంగా.. ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా కొత్త మెట్రో నిర్మాణం ఉండనుంది.
Praja Palana Application Form: ప్రజా పాలన దరఖాస్తులకు భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తగినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
New Buses in Telangana: తెలంగాణలో కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అందులో 80 బస్సులను శనివారం ప్రారంభించనుంది. వివరాలు ఇలా..
Prajapalana Abhaya Hastham 6 Guarantees Aplications: ప్రజా పాలన కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా నిర్వహించినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
Inter 1st 2nd Year Exam Time Table: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమై.. మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టీకల్స్ నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.