TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరిన్ని కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్

New Buses in Telangana: తెలంగాణలో కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అందులో 80 బస్సులను శనివారం ప్రారంభించనుంది. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 05:49 PM IST
TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరిన్ని కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్

New Buses in Telangana: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత బస్సులు ఫుల్ రద్దీగా నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో కనీసం నిలబడేందుకు కూడా స్థలం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునాతన టెక్నాలజీతో 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

వీటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. ఈ బస్సులతోపాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఈ బస్సులు అన్ని దశల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల పెరిగిన రద్దీ అనుగుణంగా కొత్త బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. 

రేపు (డిసెంబర్ 30)న అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులను ప్రారంభించనుంది. వీటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు కొత్త బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. 

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News