Prajapalana Application: ప్రజాపాలన దరఖాస్తు చేశారా..? ఒక్క ఫోన్‌ కాల్‌తో ఖాతా ఖాళీ..!

Cyber Crime in Telangana: ఆన్‌లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు.. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఓటీపీ పేరుతో మోసాలకు తెరలేపారు. మీకు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 8, 2024, 11:24 PM IST
Prajapalana Application: ప్రజాపాలన దరఖాస్తు చేశారా..? ఒక్క ఫోన్‌ కాల్‌తో ఖాతా ఖాళీ..!

Cyber Crime in Telangana: సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క ఛాన్స్‌ను వదలడం లేదు.. టెక్నాలజీతో అప్‌డేట్ అవుతూ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా.. ప్రజల నుంచి నుంచి అందినకాడికీ దోచుకుంటున్నారు.. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కూడా తమకు అనుగుణంగా మలుచుకొని.. అమాయకులను మోసం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల (Telangana Govt Six Guarantees) అమలుకు అభయహస్తం అప్లై చేసుకున్న వారికి కాల్ చేసి.. మిమ్మల్ని ఆయా పథకాలకు ఎంపిక చేస్తున్నాం.. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండంటూ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మింగేస్తున్నారు.. ఇలాంటి కాల్స్‌పై అలర్ట్‌గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

"మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు కాల్ చేస్తున్నాము.. మీరు ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు కదా.. అయితే మీకు ఆ స్కీమ్స్‌ (Prajapalana Application Status) వర్తించాలంటే మీ ఫోన్‌కు ఒక OTP పంపుతున్నాము.. దయచేసి ఆ నెంబర్ చెప్పండి. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న పథకం మీకు వర్తిస్తుంది.." అంటూ కాల్స్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు OTP కూడా అడుగుతున్నారు.. ఒకవేళ OTP ఇస్తే బ్యాంక్‌లో ఉన్న డబ్బులు అంతా లాగేసుకుంటారు సైబర్ నేరగాళ్లు.

ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police). సైబర్ నేరగాళ్లకు ఓటీపీని షేర్ చేస్తే.. మీ అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుదారులే లక్ష్యంగా ఆన్‌లైన్ కేటుగాళ్లు వల విసురున్నారు. ఇలాంటి కాల్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలువురికి రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా.. ఇది ఆన్‌లైన్ కేటుగాళ్ల పనేనని భావించిన ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఆరు గ్యారెంటీ పథకాలపై ఎలాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే.. వెంటనే కాల్ కట్ చేయాలని చెబుతున్నారు. మీరు పొరపాటున OTP షేర చేసినా.. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలని కోరారు.

Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..

Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News