Vande Bharat Express Hyderabad To Bangalore: కాచిగూడ నుంచి బెంగుళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక రైల్వే ప్రాజెక్ట్‌లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు.
Telangana High Court on TSPSC Group 1 Prelims: గ్రూప్-1 అభ్యర్థులకు బ్యాడ్‌న్యూస్. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Etela Rajender Press Meet: బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలపై ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు. డబ్బులు లేక ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ఇస్తోందన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ సాధ్యం కాదన్నారు.
Double Bedroom Houses Distribution: కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
Vijayashanti On BJP Leaders: కాంగ్రెస్‌లో చేరికపై బీజేపీ నాయకురాలు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీలోని కొందరు నేతలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
Vote From Home In Assembly Elections: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనే వివరాలతో ఆయా రాష్ట్రాలకు సమాచారాన్ని పంపించింది.
KTR Counter to Congress and BJP: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికల వేళ ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్న కేటీఆర్.. అధికారం దూరం అవుతుందని ఫ్రస్టేషన్లో కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇస్తోందని ఫైర్ అయ్యారు.
Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Congress Six Guarantee Schemes: అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని అన్నారు.
Vijayashanti On Sonia Gandhi: విజయశాంతి చేసిన ఓ ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలకు అతీతంగా సోనియా గాంధీని గౌరవిస్తామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోకి విజయశాంతి వెళ్లనున్నారా..? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
Harish Rao on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కాంగ్రెస్ దయతో రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
SC on MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణను పది రోజులు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. కౌంటర్ దాఖలుకు ఈడీ సమయంలో కోరడంతో ఈ నెల 26వ తేదీ వరకు వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా..
CM KCR to Introduce Breakfast Scheme in Telangana: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా గిఫ్ట్ ప్రకటించారు. అక్టోబర్ 24వ తేదీ నుంచి 1వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లోనే బ్రేక్‌ఫాస్ట్ అందజేయనున్నారు.
Delhi Liquor Scam Latest Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను అప్రూవర్‌గా మారినట్లు వస్తున్న వార్తలను ఖండించారు అరుణ్ రామచంద్ర పిళ్లై. ఆ ప్రచారం అంతా అబద్దం అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అరుణ్ పిళ్లై షాకింగ్ ప్రకటన చేశారు.
Telangana Politics: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. భార్యాభర్తలు ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఉన్నవారికి రైతుబంధు పథకం ఆపేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ED Notice To MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆమెకు విచారణకు హాజరవుతారా..? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.
Electricity Meters for Agriculture in Telangana: తెలంగాణ వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. తమకు ఆ ఆలోచన లేదని.. అసలు అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.