Telangana Assembly Elections: ప్రతిపక్షాలకు షాకిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. త్వరలోనే ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 80 శాతం సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Minister Harish Rao News: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్‌కు లక్ష మెజారిటీ అందివ్వాలని కోరారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.
MLC Kavitha Comments on MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనది కాదన్నారు.
KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.
Child Marriage in Nirmal: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో బాల్య వివాహం వెలుగులోకి వచ్చింది. వరుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.25 వేలు తీసుకున్న బాలిక కుటుంబ సభ్యులు.. తమ కూతురికి బలవంతంగా పెళ్లి చేశారు. సర్పంచ్ సాయంతో బాలిక అధికారులు, పోలీసులను ఆశ్రయించింది.
BRS Working President KTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో మూడు నెలలు గ్రౌండ్ లెవల్లోనే ఉండాలని నేతలకు సూచించారు కేటీఆర్.
Minister KTR on Handloom Workers: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రతి చేనేత కార్మికుడికి రూ.3 వేలు అందజేస్తామని తెలిపారు. నేత కార్మికుల కోసం గృహలక్ష్మి పథకం తీసుకువస్తామని వెల్లడించారు.
Governor Tamilisai Approves For TSRTC Merger Bill: టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై అంగీకారం తెలిపారు. అధికారుల నుంచి పూర్తి వివరణ తీసుకున్న గవర్నర్.. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. నేడే అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 10 మంది కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వం వివరణ ఇచ్చిన అనంతరం ఆమోదం తెలుపుతామని గవర్నర్ చెప్పారని కార్మిక సంఘాల నేతలే వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలనే తాను ప్రశ్నలను లేవనెత్తిన్నట్లు చెప్పారు.
Kishan Reddy Comments On BRS Govt: దేశంలో కుటుంబ పార్టీలు, అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే డీఎన్ఏతో ఉన్న పార్టీలు అని అన్నారు.
Telangana Assembly Monsoon Session 2023 Live Updates: శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరగనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Pay Revision Commission Telangana: సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారు. పీఆర్సీతోపాటు ఐఆర్‌కు సంబంధించిన నేడు లేదా రేపు ప్రకటన చేయనున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. గురువారం వారు ముఖ్యమంత్రిని కలిశారు.
సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిలకు కూడా కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్‌ను ఆఫర్ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారాయి.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలను స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల రేవంత్ రెడ్డితో భట్టి, ఉత్తమ్‌కు గ్యాప్ రాగా.. తాజాగా ముగ్గురిని కలిపి స్క్రీనింగ్ కమిటీలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వరద నష్టంపై అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరంగల్‌లో వరదల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందన్నారు. అసెంబ్లీలో ఆమె ఏం మాట్లాడారంటే..?
Crop Loan Waiver Scheme in Telangana: రాష్ట్రంలో నిధుల కొరత లేదని ఇన్నాళ్లు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. రుణ మాఫీ చేయడానికి మాత్రం కరోనా అడ్డు వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud Fires On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆర్టీఐను అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి కోట్లు సంపాదించాడని అన్నారు. తన మీద బురద జల్లడానికి అన్ని పార్టీల్లోని కొందరు నేతలు ఒక్కటయ్యారని అన్నారు.
Amrit Bharat Stations List in Telangana: తెలంగాణ నుంచి అమృత్ భారత్ స్టేషన్ల స్కీమ్‌కు 39 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. మొదటి విడతగా 21 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. వీటికి ప్రధాని మోదీ ఈ నెల 6న శంకుస్థాపన చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.