టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ నిన్న తన ఆధార్ నెంబరును ట్విట్టర్లో పోస్టు చేసి వీలైతే తన వివరాలు తెలపమని ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.
యూఐడిఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ మరియు ఏపీ రాష్ట్ర ఐటి సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే వెబ్ సైట్లలో ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండకూడదని తెలిపారు. అలాంటి డేటా ఉంటే వెంటనే తొలిగించాలని కూడా ఆయన ఆదేశించారు.
వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు ముందడుగు పడింది. ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వర్చువల్ ఐడీ(వీఐడీ)ని యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. గుర్తింపు లేదా ధృవీకరణ సమయంలో ఇకపై ఆధార్ బదులుగా వీఐడీని వెల్లడిస్తే సరిపోతుంది. జూన్ 1, 2018 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. బీటా వర్షన్లో తెచ్చిన వీఐడీని ప్రస్తుతానికైతే ప్రజలు ఆన్లైన్లో ఆధార్ చిరునామాలో మార్పులు చేర్పులు చేసుకొనేందుకు ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది.
ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)' రంగం సిద్ధం చేస్తోంది.
"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆధార్ లింకింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన విజ్ఞప్తులపై నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆధార్ గురించి తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.
ఆధార్ కార్డు కోసం ప్రజల నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారం అమ్ముడవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వస్తున్న నేపథ్యంలో విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) ఘాటుగా స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.