"ఆధార్" వల్ల నష్టమేమిటి: సుప్రీం కోర్టు

"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Last Updated : Feb 8, 2018, 11:24 AM IST
"ఆధార్" వల్ల నష్టమేమిటి: సుప్రీం కోర్టు

"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇటీవలే ఆధార్ పథకం పట్ల తమకున్న అభ్యంతరాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బహిర్గతపరిచింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ, ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల సమాచారానికి భద్రత అనే లోపిస్తుందని.. ఈ సమాచారం చేరరాని చోటుకి చేరితే.. చాలా సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

ఈ మాటలపై స్పందిస్తూ, సుప్రీం కోర్టు ప్రశ్నలను సంధించింది. భద్రత అనేది ప్రధాన కారణమైతే.. ప్రభుత్వం రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని.. కొత్త సాంకేతిక పద్ధతులను అన్వేషించాలని.. అంతే కానీ పథాకాన్ని రద్దు చేయమనడం సబబు కాదని తెలిపింది. "ఈ రోజుల్లో అన్ని చోట్లా ఇబ్బందులు ఉన్నాయి. అలాగని మీన మేషాలు లెక్కబెడుతూ కూర్చుంటామా..! ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తాం. ఆధార్ విషయంలో అదే వర్తిస్తుంది. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలో ఆలోచించాలే తప్ప.. పథకాన్ని రద్దు చేయాలని చూడకూడదు" అని తెలిపింది

అయితే ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందిస్తూ.. "జాతిని మొత్తం ఒకే తాటి వైపు తీసుకురావాలంటే ఆధార్ అక్కర్లేదు. ఆధార్ గుర్తింపు ఉంటే భారతీయులు అని చెప్పే విధానానికి మేము వ్యతిరేకం. మన దేశం ఆధార్ కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఆధార్ వల్లే నేడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి" అని తెలిపింది.

కపిల్ సిబాల్ మాట్లాడుతూ, ఇలాంటి పద్ధతినే గతంలో యూకే ప్రభుత్వం కూడా అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించిందని.. అయితే సాంకేతిక సమస్యల వల్ల ఆ ఆలోచనలు విరమించుకుందని.. అలాగే ఇలాంటి పద్ధతి వల్ల దేశానికి కలిగే హాని అంతా ఇంతా కాదని కూడా తెలిపారు. 

Trending News