Lava Blaze Curve 5G Price: ప్రస్తుతం చాలా మంది కర్వ్డ్ డిస్‌ప్లే కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఖరీదైన మొబైల్స్ కొనక్కర్లేదు..ప్రముఖ భారతీయ టెక్ కంపెనీ లావా అతి చౌకగా మార్కెట్‌లోకి కర్వ్డ్ డిస్‌ప్లేతో కూడిన చౌకైన 5G ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్‌ను కంపెనీ లావా బ్లేజ్ కర్వ్ 5 మోడల్‌లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ను లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీల్ రైనా విడుదల చేశారు. ఇదే సమయంలో మొబైల్ విడుదల తేది, ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ను కూడా వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lava Blaze Curve 5G ధర, లాంచ్ తేదీ:
లావా బ్లేజ్ కర్వ్ 5G ఫిబ్రవరి 2024లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం నలుపు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే..దాదాపు రూ.15,000కే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్‌ను ముందుగా అమోజాన్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
లావా బ్లేజ్ కర్వ్ 5G స్పెసిఫికేషన్స్:
లావా బ్లేజ్ కర్వ్ 5G 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది..ఈ మొబైల్ డైమెన్షన్ 7050 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అయితే కంపెనీ దీనిని ముందుగా 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఈ మొబైల్ 50 మెగాపిక్సెల్ ప్రధాన బ్యాక్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ విషయానికొస్తే.. 8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందబాటులోకి రానుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter