Cheapest 5G smartphone: 20 వేలలోపు బెస్ట్, చీపెస్ట్ 5జీ ఫోన్స్ ఇవే..

5G cheapest smartphone: ఇండియాలో 5జీ చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది 5 జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు, ఈ క్రమంలో చీపెస్ట్ ఫోన్ల లిస్టు మీ కోసం  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 10, 2023, 05:00 PM IST
Cheapest 5G smartphone: 20 వేలలోపు బెస్ట్, చీపెస్ట్ 5జీ ఫోన్స్ ఇవే..

Best Smartphone 5G: గత కొన్నేళ్లుగా రూ.20,000 కంటే తక్కువ ధరల ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, ఆ తక్కువ రేట్ల ఫోన్లకే డిమాండ్ పెరుగుతోంది. Xiaomi ఒకప్పుడు ఈ రేంజ్ బడ్జెట్ ఫోన్ల విషయంలో ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు Motorola, OnePlus, Samsung, Vivo, Realme వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు డబ్బుకు తగిన విలువను అందించే అనేక అషన్స్ ను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి రూ.20,000 లోపు మార్కెట్లో లభ్యమవుతున్న ఆ బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వీటిలో రెడ్ మీ నోట్ 12, మోటరోలా జీ 82, రియల్ మీ 9 ఎస్ఈ వంటి ఫోన్‌లు ఉన్నాయి. 

రెడ్‌మీ నోట్ 12
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో రెడ్‌మి నోట్ కూడా ఒకటి కాగా ఆ సిరీస్ లో వచ్చిన  Redmi Note 12 స్మార్ట్‌ఫోన్ కొంచెం ఖరీదైనది. Snapdragon 4 Gen 1 చిప్‌సెట్‌తో వస్తున్న అతి తక్కువ ఫోన్‌లలో ఇది ఒకటి. ఈ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌కు సపోర్ట్ చేయడమే కాక ఈ సిరీస్‌లో 5G కనెక్టివిటీని అందించే మొదటి నాన్-ప్రో నోట్ ఫోన్ కూడా ఇదే. ఈ ఫోన్120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడా ఉంది. Redmi Note 12 లో 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉండగా . 4GB RAM ఫోన్ రూ.17,999 కాగా  6GB RAM రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు

Motorola G82
Motorola G82 స్మార్ట్‌ఫోన్ నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. రూ. 20,000లోపు లభించే అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ప్రముఖ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 120 Hz FullHD + 10-bit AMOLED డిస్‌ప్లే అలాగే ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వబడ్డాయి. Motorola ఈ ఫోన్‌ని Android 13కి అప్‌గ్రేడ్ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ ఫోన్ 6GB RAM వేరియంట్‌ను రూ.18,999కి మరియు 8 GB RAM వేరియంట్‌ను రూ.20,999కి అందుబాటులో ఉంచింది. 

Realme 9 SE
Realme 9 SE (స్పీడ్ ఎడిషన్) స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా మొబైల్ గేమర్‌ల కోసం సిద్ధం చేశారు. స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో వచ్చే రూ. 20000 లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి. ఈ జాబితాలో ఇవ్వబడిన ఇతర ఫోన్‌ల మాదిరిగా కాకుండా, ఈ హ్యాండ్‌సెట్‌లో Android 11 OS అందుబాటులో ఉంది. అయితే, ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. మీకు గేమింగ్ ఫోన్ కావాలంటే Realme 9SE ఒక గొప్ప ఆప్షన్ .

Poco X4 ప్రో
Poco X4 Pro రూ. 20,000లోపు మంచి పనితీరును అందించే కొన్ని ఫోన్‌లలో ఒకటిగా ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 120Hz FullHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ కూడా ఇచ్చారు. ఈ జాబితాలోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే, Poco X4 ప్రోని తయారు చేయడానికి ప్రీమియం మెటీరియల్ ఉపయోగించారు. 

Infinix నోట్ 12i
మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీకు రూ. 10000 లోపు AMOLED స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కావాలంటే infinix Note 12i ఒక మంచి ఆప్షన్. Infinix యొక్క ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌లో రోజంతా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు, రోజువారీ వాడకానికి చాలా బాగుంది.

Also Read: Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్

Also Read: Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News