Amazon Great Indian Festival: ప్రముఖ యాపిల్ కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్లో ఐఫోన్ 14 సిరీస్ ఒకటి. ఈ ఫోన్ తో పాటు యాపిల్ కి సంబంధించిన పలు ఎలక్ట్రానిక్స్ ని సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఐఫోన్ 14 నాలుగు మోడల్స్ లో మార్కెట్లోకి వదిలింది యాపిల్ కంపెనీ. అయితే చాలామంది ఫీచర్లు అధికంగా ఉండే ప్రో మోడల్ కొనేందుకు ఇష్టపడతారు. ఈ ప్రో మోడల్ ధర ప్రస్తుతం రూ. 1,39,900 ఉంది. అయితే ఐఫోన్ ప్రియులు తక్కువ ధరకే ఈ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు అమెజాన్ మీకు చౌక ధరల్లో విక్రయిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఐఫోన్ ఇతర ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ డిస్కౌంట్ వినియోగదారులకు విక్రయిస్తుంది. ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ 14 ప్రో ను కేవలం రూ. 23,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు.
డిస్కౌంట్ తో ఇలా కొనుగోలు చేయండి:
ఐఫోన్ 14 ప్రో 256 జిబి వేరియంట్ అమెజాన్ లో రూ. 1,39,900 ధరతో అందుబాటులో ఉంది. రూ. 23,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ని పొందాలనుకుంటే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను పెంచుకోవాల్సి ఉంటుంది.
కొనుగోలు చేసే పద్ధతి:
అయితే ఈ మొబైల్ ను అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే చాలా చౌకగా లభించనుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 కంటే ఎక్కువగా తక్షణం తగ్గింపు పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3000 తగ్గింపుతో లభిస్తుంది. ఇక ఈ అన్ని డిస్కౌంట్ పోను ఐఫోన్ 14 ప్రో రూ. 1,35,650 లకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ప్రవేశపెట్టారు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ విషయానికొస్తే.. మీ విలువచేసే పాత ఐఫోన్ గాని ఇతర ఫోన్ గాని ఎక్స్చేంజ్ చేస్తే..రూ. 28,000 దాకా తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్లు పోను ఐఫోన్ 14 ప్రో కేవలం రూ. 1,07,650
పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు:
ఐఫోన్ 14ప్రో 256GB వేరియంట్
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR (XDR) డిస్‌ప్లే
A16 బయోనిక్ చిప్
5G స్మార్ట్
క్వాడ్-కెమెరా సెటప్
48MP ప్రైమరీ సెన్సార్
మూడు 12MP సెన్సార్లు
12MP ఫ్రంట్ కెమెరా
క్విక్ ఛార్జింగ్ సపోర్ట్
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook