Amazon Sale: అమెజాన్‌లో Samsung, Apple, OnePlus, Realme మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌..

Amazon Sale On Popular Smartphones: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్‌ ప్రారంభం కాబోతున్నాయి. Samsung, Apple, OnePlus, Realme బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 04:34 PM IST
Amazon Sale: అమెజాన్‌లో Samsung, Apple, OnePlus, Realme మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌..

Amazon Sale On Popular Smartphones: అతి చౌకగా స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌ శుభవార్తను అందించింది. శనివారం నుంచి అమెజాన్‌ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ బెస్ట్ ధరలకు లభించనున్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Samsung, Apple, OnePlus, Realme బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌ కోనుగోలు చేస్తే 30 నుంచి 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరలకు లభించే మొబైల్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Apple iPhone 13:
రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ Apple iPhone 13 స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ. 59,900 కాగా.. ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.48,999కే లభిస్తోంది. ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే ఈ మొబైల్‌ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు చాలా రకాల ఫీచర్స్‌ లభిస్తోంది. 

OnePlus Nord CE 3 Lite 5G:
మార్కెట్‌లో ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యేక డిమాండ్‌ ఉంది. ఈ మొబైల్‌ అసలు MRP ధర రూ.19,999 కాగా రిపబ్లిక్ డే సేల్‌లో రూ.17,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..108MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది. దీంతో పాటు  67W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

OnePlus 11R:
వన్‌ప్లస్‌ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌లో OnePlus 11R ఒకటి..ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ రూ. 38,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే,  Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌పై పని చేస్తేంది. దీంతో పాటు Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.

Samsung Galaxy S23:
ఈ Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్‌ కూడా ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం  ఈ మొబైల్ ధరతో రూ. 64,999కి అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.54,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్‌ Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News