Buy Apple iPhone 14 Plus only Rs 46990 in Ivenus: భారత మార్కెట్‌లో 'యాపిల్ ఐఫోన్'కు చాలా క్రేజ్ ఉంది. యువతతో పాటు పెద్దలు కూడా తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మిగతా ఫోన్‌ల కంటే ఐఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది కొనలేకపోతున్నారు. అయితే ఒక్కోసారి పలు సేల్స్ సందర్భంగా ఐఫోన్‌ల ధరలు భారీగా తగ్గుతాయి. అలాంటి సదావకాశమే ఇప్పుడు మీ ముందు ఉంది. గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఉంది.
వాలంటైన్స్ డే 2023కి మరో ఒకరోజు మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో పలు ఈ కామర్స్ దిగ్గజాలు ముందునుంచే భారీ ఆఫర్స్ ప్రకటించాయి. వాలంటైన్స్ వీక్ సందర్భంగా యాపిల్ థర్డ్ పార్టీ అధీకృత రిటైల్ సెల్లర్ ఐవీనస్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 14 మోడల్‌పై బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ లాంటివి కలుపుకుని మొత్తంగా రూ.42,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఐఫోన్ 14 ధర రూ. 79,990లుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ అన్ని ఆఫర్లూ పోనూ రూ. 37,900కే లభిస్తుందని ఐవీనస్ ప్రకటించింది. ఐవీనస్ స్టోర్ రూ.8 వేలు డిస్కౌంట్ ఇస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్స్‌పై రూ. 4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా (ఎక్స్ఛేంజ్ బోనస్) రూ. 30 వేల వరకు పొందొచ్చని ఐవీనస్ తెలిపింది. మొత్తంగా అన్ని ఆఫర్లూ కలుపుకొంటే రూ.42వేలు అవుతుంది.
ఐఫోన్ 14 ప్లస్ సైతం అన్ని ఆఫర్లతో కలిపి రూ.46,990కే లభిస్తుందని ఐవీనస్ ప్రకటించింది. ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 89,990లుగా ఉంది. ఇందులో ఐవీఎన్ రూ. 9వేల డిస్కౌంట్ అందిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. ఐఫోన్ 13పై అన్ని ఆఫర్లు పోను రూ.30,900కే లభించనుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ 14 ప్లస్‌పై బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: 7 Ball Over: మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో ఘోర తప్పిదం.. 7 బంతులు వేపించిన అంపైర్!
Aslo Read: Venkatesh Warning: నెట్ ఫ్లిక్స్ కు వెంకీ మామ వార్నింగ్.. నా పేరే పెట్టాలంటూ వీడియో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.